అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న వారికి కడుపునిండా అన్నం పెట్టడం కంటే మించిన పుణ్యం లేదని మై వేములవాడ అన్నదాన సేవా ట్రస్టు నిర్వాహకులు పేర్కొన్నారు. దాతల సహకారంతో గత 2016 రోజులుగా పేదలకు అన్నదాన సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టీటీడీ ధర్మశాల సమీపంలోని రాజన్న భీమన్న ఆలయం వద్ద 50 మంది అన్నార్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సేవలకు అన్నదాన శాశ్వత సభ్యులుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు, స్నేహాలత, ప్రతాప స్వప్న సంపత్, నగుబోతు రవీందర్జ్యోతి, గణాచారి మఠం శైలజసాంబశివు, దేవరాజు ఉమ, బాలచందర్రాజు దంపతులు, రామడుగు శ్రీలత కుటుంబ సభ్యులు, హైదరాబాద్కు చెందిన చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ తదితరులు సహకరిస్తున్నారు.
పురాణాల ప్రకారం అన్నదానం ప్రాముఖ్యత
పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఆయువు, బలం, తేజస్సు, కీర్తి పెరుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లిరోజు లేదా ఇతర శుభకార్యాల సందర్భంగా వేములవాడ ఆలయం వద్ద ఒకరోజు అన్నదానం చేయాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని కోరారు.
అన్నదానం చేయదలచిన వారు 9246939388 నంబర్లో సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, ప్రతాప నటరాజు, పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


