నిర్మల్, 8 September
జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం జరిగింది. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేశారు.
క్యాన్సర్ వైద్యశిబిరానికి విశేష స్పందన. -200 మందికి ఉచిత పరీక్షలు. సారంగాపూర్ మనోరంజని తెలుగు టైమ్స్ జిల్లా, సారంగాపూర్:మండల కేంద్రంలో సోమవారం లైన్స్ క్లబ్ అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు... ఆసుపత్రికి చెందిన ముగ్గురు ప్రధాన వైద్యులు డాక్టర్ ఆదిబా అలీ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ మాన్విత డాక్టర్ ప్రశాంత్ లు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేశారు.. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు రమణారెడ్డి, పోగ్రాం చైర్మెన్ గంగారెడ్డి, మాట్లాడుతూ.. పేద ప్రజలకు క్యాన్సర్ భారం కాకుండా... వైద్యాన్ని అందుబాటులో ఉండేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి.. బారిన ప్రజలు విస్తృతంగా.. పడుతున్న నేపథ్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మాట్లాడుతూ. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోనేరు భూమన్న,ఉప సర్పంచ్ కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి ,మార్కెట్ చైర్మెన్ అబ్ధుల్ హాది, మాజీ చైర్మెన్ రాజ్ మహమ్మద్ ,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి,లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రెడ్డి,ఆలయ గ్రామాల సర్పంచులు గంగారెడ్డి,సాయన్న, నాయకులు సామల వీరయ్య,నారాయణరెడ్డి, పాల్గొన్నారు.



