నిర్మల్ జిల్లా మండలం పొనకల్ గ్రామంలో పోషకాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను చేపట్టారు. పోషకాహారం ప్రాముఖ్యత, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
పోషకాహారంతో తల్లులు, పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా పోషకాహారం ప్రాముఖ్యత, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ పోషకాహార మాసోత్సవాల కార్యక్రమంలో సెక్టార్ పర్యవేక్షకురాలు శ్యామల, గ్రామ సర్పంచ్ లక్ష్మి రాజారెడ్డి, ఉపసర్పంచ్ రాజారెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, హోమియోపతి వైద్యుడు, వార్డు సభ్యులు, గ్రామ సమాఖ్య ప్రతినిధి భీక్సింగ్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.












