భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆశీర్వాద దీపాన్ని వెలిగించారు. మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవకు అంకితమైన మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం స్ఫూర్తిదాయకమని, దేశ ప్రగతి కోసం నిరంతరం పనిచేయాలనే సంకల్పానికి ఆశీర్వాద దీపం ప్రతీకగా నిలిచిందన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు స్వన్లి రమేష్, ఎత్తిపోతల పథకం చైర్మన్ పోగుల రాజేశ్వర్, నిర్మల్ జిల్లా పరిషత్ సభ్యుడు బిద్ధూర్ రమేష్, ఓని శివాజీ, చింతల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.












