కుంటాల మండలంలోని పెంచికల్పాడు గ్రామానికి చెందిన వెంకటాచారి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల 50 వేల ఆర్థిక సాయం మంజూరైంది.
వెంకటాచారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. ఈ మేరకు మంజూరైన ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్, మాజీ సర్పంచ్ దిగంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీకాంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.












