హైదరాబాద్, 10 September
పర్యావరణ పరిరక్షణ సందేశంతో రూపొందించిన విత్తన గణపతులను ప్రముఖ యాంకర్ శ్రీముఖికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ నూతికడి భోజనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణహిత గణపతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
యాంకర్ శ్రీముఖికి విత్తన గణపతి అందజేత హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను యాంకర్ శ్రీముఖికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ నూతికడి భోజనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా భోజనారాయణ మాట్లాడుతూ.. సంప్రదాయాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రధాన సందేశమని తెలిపారు. విత్తన గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం నేలలో నాటితే, ఆ గణపతి మొక్కగా మారి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత విత్తన గణపతులను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ మట్టి, విత్తన గణపతులను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.










