లోకేశ్వరం మండల కేంద్రంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అడిషనల్ పీడీ చరణ్‌దాస్ సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా పండుగలను నిర్వహించాలని, మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.
మండల కేంద్రంలో వీబీ రాంజీ ఐకేపీ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పాత్రలో నిమజ్జనం చేశారు. విగ్రహం పూర్తిగా కరిగిన తర్వాత మిగిలిన మట్టి, నీటిని మొక్కలకు పోశారు.
ఈ సందర్భంగా అడిషనల్ పీడీ చరణ్‌దాస్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలగకుండా పండుగలను నిర్వహించాలని, మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను వినియోగించాలని, నిమజ్జన కార్యక్రమాలను పర్యావరణహితంగా నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏపీవో అనిల్, ఏపీఎం భోజన్న, టీఏలు శారద, హరిత, మంజుల, సీసీలు మహేందర్, రాజేశ్వర్, శ్రీనివాస్, సుకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ అంబకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












