కుబీర్, 7 September
నిర్మల్ జిల్లా మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు.
*పల్సి విద్యా భారతి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం.....* *విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి* *సమానంగా* *పంచే గొప్ప దాత* *గురువు......* *వృత్తుల్లో గొప్ప వృత్తి* *ఉపాధ్యాయ వృత్తి....* *నిర్మల్ జిల్లా *: మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ....... సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. తల్లిదండ్రులైన తమ ఆస్తిని పిల్లలకు పక్షపాతంతో పంచవచ్చు, కానీ తన దగ్గర ఉండే విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి సమానంగా పంచే గొప్ప దాత ఉపాధ్యాయుడు. ఈ ప్రపంచంలో ఎవరెవరినో ఏమేమో చేసి వాళ్లు వాళ్లు గానే మిగిలి పోయేది ఒక్కరే ఒక ఉపాధ్యాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోతన్న, లక్మ మధుసూదన్, కొట్టే ప్రవీణ్, పురంశెట్టి రాజు, గౌర సాయినాథ్, పంతుల దేవేందర్, డోలేవార్ దేవకి, సరస్వతి, భువనేశ్వరి, సరోజన,గంగామణి, కవిత, రాణి, శృతిక , పద్మ, నేహ, గంగావేణి, లక్ష్మి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.












