నిర్మల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో మార్గదర్శకత్వం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు ఉచిత ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సహకారంతో, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, ముఖ్యమైన అంశాలు, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యే విధానంపై నిపుణులైన ఫ్యాకల్టీ సత్య ఎర్రగడిన్ల, గంగాధర్, శ్రీకాంత్, కలీం, సంజీవ్, రవి తదితరులు శిక్షణ అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించడంతో పాటు, శిక్షణార్థులకు మధ్యాహ్న భోజనం, టీ ఉచితంగా అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత ప్రీ-రిక్రూట్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని అన్నారు.
అభ్యర్థులు క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వంతో పాటు రాత పరీక్షకు కూడా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రతిరోజూ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ, ఫ్యాకల్టీ అందించే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 300 మంది విద్యార్థులకు అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, స్పష్టమైన లక్ష్యంతో ప్రతిరోజూ కష్టపడి చదవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని, అభ్యర్థులు ఎలాంటి నిరుత్సాహానికి లోనుకాకుండా పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, నిరంతర కృషితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చని తెలిపారు. పోలీస్ ఉద్యోగాల లక్ష్యంతో ఉన్న యువతకు జిల్లా పోలీస్ శాఖ తరఫున అవసరమైన మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భైంసా సాయి కిరణ్, , నిర్మల్ శ్రీనివాస్, లు కృష్ణ, సమ్మయ్య, () రామ్ నిరంజన్, లు, పోలీస్ సిబ్బంది, ఫ్యాకల్టీ సభ్యులు, 300 మంది శిక్షణార్థి విద్యార్థులు పాల్గొన్నారు. తరగతుల సమయం: ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు. స్థలం: నిర్మల్ పోలీస్ బ్రీఫింగ్ హాల్ (నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన).












