మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలపాటి అచ్యుతానంద రెడ్డి కోరారు. పిల్లలపై శారీరక శిక్షలు, బెదిరింపులు, అవమానకర ప్రవర్తనను పూర్తిగా అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలపాటి అచ్యుతానంద రెడ్డి కోరారు.
చిన్నపిల్లలను కొట్టడం, బెదిరించడం, అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల పిల్లలను ప్రేమతో, ఓర్పుతో బోధిస్తూ, వారి ఆత్మవిశ్వాసం, మానసిక వికాసానికి అనుకూలమైన వాతావరణాన్ని పాఠశాలలు కల్పించాలని సూచించారు.
శాశ్వత భద్రతా వ్యవస్థ బలోపేతం
ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మండలంలోని ప్రతి పాఠశాలలో శాశ్వతమైన పిల్లల భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని అలపాటి అచ్యుతానంద రెడ్డి సూచించారు.
ఫిర్యాదు వ్యవస్థ, కమిటీల ఏర్పాటు
పిల్లలపై శారీరక శిక్షలు, బెదిరింపులు, అవమానకర ప్రవర్తనను పూర్తిగా అరికట్టాలని, ప్రతి పాఠశాలలో చైల్డ్ సేఫ్టీ కమిటీ , ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తూ పిల్లల చదువు, భద్రత, మానసిక స్థితిపై చర్చించాలని తెలిపారు.
తనిఖీలు, పర్యవేక్షణ ఆవశ్యకత
ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలు, అవసరమైన వెరిఫికేషన్‌ను పర్యవేక్షించడంతో పాటు, , అగ్నిమాపక పరికరాలు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాల భద్రతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించడంతో పాటు, పిల్లల మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
పిల్లలను పాఠశాలకు పంపినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత పూర్తికాదని, వారు సురక్షితంగా, సంతోషంగా, గౌరవంగా చదువుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అలపాటి అచ్యుతానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు.












