ఆదిలాబాద్ జిల్లా కే ఆర్కే కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకంపై 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా వంటగదుల పరిశుభ్రత, భోజన పదార్థాల నాణ్యత, నిల్వ విధానం వంటి అంశాలను కౌన్సిలర్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులను నేరుగా అడిగి, వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందుతోందా లేదా అని కౌన్సిలర్ రజిత రాము ఆరా తీశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న పాఠశాల హెచ్ఎంను, ఉపాధ్యాయులను కౌన్సిలర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లింగంపల్లి శశికాంత్, పాయల్ రాజు, ఎల్చాలా పోచన్న, ముస్లె ఈశ్వర్, దొబ్బల రవి తదితరులు పాల్గొన్నారు.











