విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. మండలం తుంగపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీల విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు.
క్రీడల ప్రాముఖ్యత
క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుంగపాడు హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మంగళ, సర్పంచ్ బెడదూరి వెంకటరెడ్డి, మండల విద్యాధికారి ధర్మానాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, డిసిసిబి మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, లింగయ్య యాదవ్, ఉపాధ్యాయులు ఎల్. కోటానాయక్, టోర్నమెంట్ ఆర్గనైజర్ షహీద్, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, వెంకటరత్నం, ఫిజికల్ డైరెక్టర్లు శోభారాణి, మనోహర్, సైదులు, దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటయ్య, అనిల్ సుమన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.












