నిర్మల్ జిల్లా మండలంలోని బీరవెల్లి గ్రామంలో గల విజేత యూ. పి స్కూల్ ఉపాధ్యాయురాలు అంగారి పుష్పలత (హేమ)కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. 17వ తేదీన నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
నిర్మల్ జిల్లా మండలంలోని బీరవెల్లి గ్రామంలో గల విజేత యూ. పి స్కూల్ ఉపాధ్యాయురాలు అంగారి పుష్పలత (హేమ)కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. 17వ తేదీన నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన పుష్పలతకు అభినందనలు తెలిపారు. ఇటువంటి అవార్డులు ఉపాధ్యాయుల్లో శిక్షణ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ (రాజు), శ్రీధర్, సంగీత, తిరుమల, మమత, ఇందు, సంధ్య, రమ్యతో పాటు విద్యార్థులు పుష్పలతను అభినందించారు.












