సారంగాపూర్ లోని లోటస్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బిోడా కుంటి రాజమణికి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు దక్కింది. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా చేతుల మీదుగా ఈ నెల 17వ తేదీన ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ, ట్రస్మా ఆధ్వర్యంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే బిోడా కుంటి రాజమణికి ఈ గౌరవం దక్కింది. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన బిోడా కుంటి రాజమణిని లోటస్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అభినందించింది. పాఠశాల చైర్మన్ రాజ్మహమ్మద్, వైస్ చైర్మెన్ లింగారెడ్డి, జనరల్ సెక్రెటరీ లక్ష్మారెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వర్, తో పాటు ఉపాధ్యాయ బృందం ఆమెను ప్రశంసించారు.











