సారంగాపూర్ లోని లోటస్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బోడ కుంటి రాజమణికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా చేతుల మీదుగా ఈ నెల 17వ తేదీన ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కష్టపడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ పురస్కారాలను అందజేశారు. ట్రస్మా ఆధ్వర్యంలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ అవార్డులు ప్రధానం చేశారు. రాజమణికి అవార్డు లభించడం పట్ల పాఠశాల యాజమాన్యం చైర్మన్ రాజ్మహమ్మద్, వైస్ చైర్మెన్ లింగారెడ్డి, జనరల్ సెక్రెటరీ లక్ష్మారెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.











