కూతురికి ఎంబీబీఎస్ సీటు రావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని గ్రామస్థులతో పంచుకుంటూ వినాయకుడి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించారు. మండలం లావుడి తండాకు చెందిన లావుడి హతిరామ్కైవ దంపతుల కుమార్తె గౌతమికి కేరళ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు లభించింది. కూతురు వైద్య విద్యలో ప్రవేశం పొందడంతో సంతోషించిన హతిరామ్ బుధవారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని భోజనం చేశారు. కూతురు వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. గౌతమి భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావుడి శ్రీహరి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్, ఎంపీటీసీ అరుణ బలరాం నాయక్, మచ్చ వెంకన్న, జగన్, సువ్వ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కూతురికి ఎంబీబీఎస్ సీటు.. ఆనందంలో తండ్రి అన్నదానం
Share:

సారాంశం
కూతురికి ఎంబీబీఎస్ సీటు రావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని గ్రామస్థులతో పంచుకుంటూ వినాయకుడి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- ఈ ఆనందాన్ని గ్రామస్థులతో పంచుకుంటూ వినాయకుడి ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించారు.
- మండలం లావుడి తండాకు చెందిన లావుడి హతిరామ్కైవ దంపతుల కుమార్తె గౌతమికి కేరళ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు లభించింది.
- కూతురు వైద్య విద్యలో ప్రవేశం పొందడంతో సంతోషించిన హతిరామ్ బుధవారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- వినాయకుడి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని భోజనం చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3637ఆర్టికల్స్
4,51,618వ్యూస్










