జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అష్టావధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ అవధాని బానోత్ నితిన్ తన ప్రతిభతో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, భాషా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అష్టావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువ అవధాని బానోత్ నితిన్ అష్టావధానం నిర్వహించి తన ప్రతిభతో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి పద్యకోకిల, అష్టావధాని డా. బొచ్కర్ ఓం ప్రకాష్ సంచాలకులుగా వ్యవహరించగా, అప్రస్తుత ప్రసంగికుడిగా కోకిల నాగరాజు, నిషిద్ధాక్షరిగా నాగుపల్లి రాజేందర్, పురాణ పఠనంగా అహల్యాదేవి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు నితిన్, ధనుష్, నేహాశ్రీ, హాసిని, మానస, యశస్వి, ఎక్ష్విక, మనస్వి, రాజ్‌బాల తదితరులు పృచ్ఛకులుగా వ్యవహరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాహిత్య అంశాలపై ప్రశ్నలు, సమస్యలను అవధానికి అందించగా, నితిన్ తన ప్రతిభతో వాటికి సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి అశోక్, మండల విద్యాధికారి గంగారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అష్టావధానం వంటి సాహిత్య కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు, సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండలంలోని పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.












