మానుగూరు, 14 September
మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా గణపతి 24వ నవరాత్రి మహోత్సవాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు.
మణుగూరులో గణపతి నవరాత్రి ఉత్సవాలు మహా గణపతికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు మణుగూరు, సెప్టెంబరు 14: మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా గణపతి 24వ నవరాత్రి మహోత్సవాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











