లక్ష్మణచాంద, 13 September
షమణమణఉథమమ.ఈమఎఐహూచచ.మఖమమఉచచ.
లక్ష్మణ్ మండలంలోని గణపతి మండపాల నిర్వాహకులతో ఎస్ఐ శ్రావణి శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మండపాల నిర్వాహకులకు పలు సూచనలు అందించారు. గణపతి నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. వినాయకుని శోభాయాత్ర సమయంలో అధికారులు సూచించిన విధంగా, రెండు బాక్సులతో కూడిన సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుండి డీజే సౌండ్ సిస్టమ్‌ను శోభాయాత్ర సమయంలో ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.












