లక్ష్మణచాంద, 11 September
మార్కండేయ దేవస్థానంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభమైంది
లక్ష్మణ మండల కేంద్రం లో మార్కండేయ దేవస్థానం లో నెల రోజులు భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ ప్రతి హిందువులు తప్పకుండ తన సనాతన ధర్మం ను కాపాడాలని దానికోసం మనం భజన, మరియు సాంస్కృతిక కార్యక్రమలు చేస్తూ ఉంటే మనం సనాతన ధర్మనీకి జీవం పోస్తున్న వారం అవుతామని భక్తులకు తెలియజేశారు. ప్రతి సోమవారం ఇలాగే భజన కార్యక్రమం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అని భక్తులు అందరూ తప్పకుండ రాగలరని విన్నవించారు. మార్కండేయ ఆలయం లో ధర్మానికి సంభందించిన మరిన్ని కొత్త కొత్త కార్యక్రమలు నిర్వహిస్తామన్నరు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భజన భక్తులకు, శాలువాలతో సన్మానం చేసారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.












