సంతోష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో హరిదాస స్వామి, అంభేం సాయిలు, గుజ్జ రాజేశ్వరి, బుస్సాపూర్ శంకర్, జ్యోతి, శ్రీకాంత్, కొంపల్లి హేమలత, రమేష్, స్వప్నతో పాటు పలువురు పాల్గొన్నారు.
గోల్ హనుమాన్ వద్ద ఉన్న సిర్నాపల్లి గడి ప్రాంగణంలోనే దేవీ నవరాత్రుల ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుజ్జ రాజేశ్వరి తెలిపారు.










