నిర్మల్ జిల్లా మండలంలోని మాటెగావ్కొరడి శ్రీ గణనాథుడిని మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో ఇద్దరు నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కొరడి గణనాథుడు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారని, స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని అన్నారు. కొరడి గణనాథుడి ప్రత్యేకతను, ఆలయ ప్రాశస్త్యాన్ని ఆయన వివరించారు.
అలాగే ఆలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ భాయి రాజన్న, నాళం శ్రీనివాస్ రెడ్డి, సారంగాపూర్ మాజీ ఎంపీపీ మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మహిపాల్, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాటిల్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












