నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఆదివారం గణనాథుని నిమజ్జన ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. వర్షం కురుస్తున్నప్పటికీ నిమజ్జనోత్సవ సందడి కనిపించింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్థానిక సర్పంచ్, బిజెపి నాయకులతో కలిసి నిమజ్జన ఉత్సవాలను ప్రారంభించారు.
ఆయన ప్రతి గణేష్ మండపానికి వెళ్లి పూజలు చేశారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు. యువకులతో కలిసి ఆయన స్టెప్పులేశారు. విగ్నేశ్వరుని మండపాల వద్ద ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది.
ఎమ్మెల్యే పర్యటన
వర్షంలో పాదయాత్రగా ఆయన ముధోల్ అంతా తిరిగారు. ఈ సందర్భంగా యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు గణేష్ మండపాల వద్ద ఘన స్వాగతం లభించింది.

