రైతు భరోసా పథకం కింద నిధులు జమ అయినట్లుగా సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ సందేశాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్వరం ఎస్ఐ ప్రదీప్ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, వ్యక్తిగత వివరాలు వెల్లడించడం వంటివి చేయవద్దని సూచించారు.
రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ అయినట్లుగా సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ ఎస్ఎంఎస్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్వరం ఎస్ఐ ప్రదీప్ సూచించారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన రైతులను కోరారు. డబ్బులు జమ అయినట్లుగా వచ్చే సందేశాల్లోని అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను ఎవరికీ వెల్లడించవద్దని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి సందేశాల ద్వారా ఖాతాల్లోని డబ్బులను కాజేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. బాధితులు ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదిస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.












