మోర్తాడ్ నాటు సారా కేసులో పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని మోర్తాడ్ మధ్యనిషేధ, ఆబ్కారీ శాఖ అధికారులు బహిరంగ వేలం వేయనున్నారు. ఈ నెల 5వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మోర్తాడ్ ఆబ్కారీ పోలీస్ స్టేషన్ ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎస్హెచ్ఓ గుండప్ప విశ్వనాథ్ తెలిపారు.
వేలం నిబంధనలు
వేలం పాటలో పాల్గొనాలనుకునే ఆసక్తిగలవారు ముందుగా వాహనంపై నిర్ణయించిన వేలం నిబంధనల ప్రకారం 25 శాతం ఈఎండీ (ముందస్తు ధరావతు) చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. ఆసక్తిగలవారు నిర్ణీత సమయానికి స్టేషన్కు చేరుకోవాలని అధికారులు తెలిపారు.












