రాజకీయాల్లోఆరోపణలు,విమర్శలు సహజమని,ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని, రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని, ఎవరి మెప్పు కోసమో గాని వ్యక్తిగత కక్షతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం బాధాకరమని, వ్యక్తిగత దూషణలు, నిరాధారమైన ఆరోపణలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాననిమిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ పేర్కొన్నారు. భార్గవ్ ప్రస్తావించిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ ఛైర్మన్‌గా 26-01-2025 వరకు పనిచేశానని, తన పదవీకాలం ముగిసి ఇప్పటికి సుమారు 20 నెలలు అవుతుందన్నారు. కొత్త మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 7 నెలలకు పైగా గడిచిందన్నారు.కొందరు తమ పేరు, వివరాలు వెల్లడించకుండా సోషల్ మీడియాలోవ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మిర్యాలగూడలో ఇంతకుముందు లేని విధంగావాతావరణాన్ని కలుషితం చేయడం బాధాకరమన్నారు.
నేను చైర్మన్ గా మిర్యాలగూడ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు.మా కుటుంబానికి ప్రజాసేవ కొత్త కాదని భార్గవ్ పేర్కొన్నారు.మా తండ్రి గంగాధర్ తిరునగరు స్వాతంత్ర్య సమరయోధులు, భారత సైన్యంలో సేవలందించిన వ్యక్తిగా, మిర్యాలగూడ గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేశారని, ఆయన హయాంలో తాగునీరు, బస్టాండ్, గ్రామ పంచాయతీ కార్యాలయం వంటి ప్రజా అవసరాల కోసం పనులు జరిగాయని వివరించారు. ఆయన కాలంలో నిర్మించిన కొన్ని డ్రైనేజీలు ఇప్పటికీ ప్రజల వినియోగంలో ఉన్నాయన్నారు.
కార్మికులు, ఎస్సీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన ప్రజాసేవా వారసత్వం నుంచి వచ్చినమాకుటుంబంలో
మా అన్నయ్య రమేష్ తిరునగరు మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారన్నారు.
నిధుల దుర్వినియోగం జరిగిందని ఎవరికి ఏమైనా ఆధారాలు ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాకుండా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యండి అనిఅన్నారు.మున్సిపల్ భూములఆక్రమణ జరిగిందని అనుకుంటే
ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు.ప్రధాన డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పేరుతో, మున్సిపల్ వాహనాలను ఉపయోగించి, బిల్లులు నమోదు చేసి నిధులు డ్రా చేశారని ఆరోపణలు కాదు. సంబంధిత రికార్డులతో అధికారులకు ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు.మేము విచారణకు, రికార్డుల పరిశీలనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మాత్రం ప్రజాస్వామ్య విమర్శ కాదన్నారు.నా పదవీకాలం ముగిసి సుమారు 20 నెలలు గడిచిన తర్వాత ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ప్రజలే అర్థం చేసుకోగలరన్నారు.రాజకీయంగా నన్ను విమర్శించండి.నా పనితీరునుప్రశ్నించండి.
నానిర్ణయాలనుప్రశ్నించండి.నా పాలనపై ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు మాత్రం సహించేది లేదు అని అన్నారు.ఎవరు ఈ పోస్టులు చేశారో గుర్తించి, వారి పోస్టులపై
విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ పేర్కొన్నారు.












