మిర్యాలగూడ, 9 September
మిర్యాలగూడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను శాలువాలు, మెమొంటోలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పలువురు వక్తలు తెలిపారు.
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం : డైమండ్ శ్రీనివాస్ 👉 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా "జర్నలిస్ట్ డే" మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక డైమండ్ బేకరీ సీట్ హౌస్ ప్రాంగణంలో ఘనంగా జర్నలిస్ట్ డే ను నిర్వహించి పలువురు జర్నలిస్టులను శాలువాలు మెమొంటో లను అందజేసి ఘనంగాసన్మానించారు. జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్టులు ఖాజా హామీద్దీన్, నాగయ్య, వెంకన్న, అస్లాం, రంగ శ్రీనివాస్, నాజీమొద్దిన్, జంగ లక్ష్మణ్ యాదవ్, అయూబ్ లకు సత్కరించి,సీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఐసీసీ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్)మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీలు మిట్టపల్లి విజయభాస్కరరావు రీజియన్ చైర్ పర్సన్ ఓరుగంటి శ్యాంసుందర్, డిస్టిక్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఇంచార్జ్ సామ శ్రీనివాస్, రీజియన్ సెక్రటరీ గట్టు వెంకటేశ్వర్లు, జోన్ చైర్ పర్సన్ పాంపాటి రామలింగయ్య, కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ భవిరిశెట్టి మధు, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పూరి శంకరయ్య వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మా శెట్టి గీత డైమండ్ తదితరులు పాల్గొన్నారు.












