కుల, మత, వర్గ, లింగ వివక్షత లేని, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణానికి పాటుపడాలని, సమాజహితం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని , జిల్లా ఇంచార్జిలు బోడ సునీల్ మాదిగ, అనిల్ మాదిగ, శివ మాదిగ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన అనంతరం, కుల, మత, వర్గ, లింగ వివక్షత లేని, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణానికి పాటుపడాలని, సమాజహితం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధమవుతామని జిల్లా ఇంచార్జిలు బోడ సునీల్ మాదిగ, అనిల్ మాదిగ, శివ మాదిగ అన్నారు.
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో , , కామారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని సామెల్ మాదిగ పర్యవేక్షించగా, జిల్లా నాయకుడు బట్ట వెంకట్రాములు మాదిగ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జి బోడ సునీల్ మాదిగ, దూప్పెలి అనిల్ మాదిగ, ఉమ్మడి జిల్లా ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ ఉద్యమం విజయం సాధించినా దాని వెనుక విద్యార్థి శక్తి దాగి ఉందని అన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించడంలో మాదిగ విద్యార్థులు కూడా అద్వితీయ పాత్ర పోషించారని అన్నారు.
అయితే, దేశంలో ఏండ్ల తరబడి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తీవ్రంగా కొనసాగుతున్నాయని, కుల, మత, లింగ వివక్షత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. అందువల్ల, దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం రావాల్సిన అవసరం ఉందని, అన్ని రకాల వివక్షతలు తొలగిపోవాలని అన్నారు.
భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణ
అందుకోసం మహనీయుల బాటలో భవిష్యత్ ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పోరాటం శక్తివంతంగా ముందుకు సాగాలంటే విద్యార్థులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు. అందుకోసం విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తూ, విద్యా సంస్థలో, హాస్టల్లో నూతన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ () కమిటీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గ్రామంలో, మండలంలో, హాస్టల్, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో కమిటీలు వేయాలని అన్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో విద్యార్థులతో సమావేశాలు జరిపి, నూతన కమిటీలు ఏర్పాటు చేసి, వారిని భవిష్యత్ ఉద్యమానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంథని సామెల్ మాదిగ, జాతీయ నాయకులు యమున మాదిగ, పద్మ మాదిగ, సత్తిగారి లక్ష్మి మాదిగ, పద్మ రావ్ మాదిగ, మావురం శ్రీకాంత్ మాదిగ, గంగారాం, డాక్టర్ సత్యం, అల్లూరి, ఉషయ్య, రాజు మాదిగ, స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.








