మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పార్పెల్లి గ్రామానికి చెందిన వినేష్ కరెంట్ షాక్ తో, మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి ముత్తన్న అనారోగ్యంతో, చామనపెల్లి గ్రామానికి చెందిన సింగారం పోశెట్టి పాము కాటుతో, సుంకరి ముత్తన్న అనారోగ్యంతో, లక్ష్మణచంద మండల కేంద్రంలో మరణించిన బిర్కుల గంగన్న, నర్సాపూర్ () గ్రామంలోని నాంపల్లి మహేందర్ అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ దుర్ఘటనల నేపథ్యంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయా కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శల కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ జడ్పిటీసీ ఓస రాజేశ్వర్, బోరిగాం, చామనపెల్లి సర్పంచులు మల్లికార్జున్ రెడ్డి, అయిట్ల లక్ష్మి-సుదర్శన్, కనకాపూర్, మల్లాపూర్, లక్ష్మణచంద, చామనపెల్లి, పార్పెల్లి మాజీ సర్పంచులు నారాయణ, మేకల రాజేంధర్ యాదవ్, కేశం శ్రీనివాస్, గంగాధర్, రాజేందర్, నర్సాపూర్, పార్పెల్లి మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్, గణేష్, పిఏ రాజు, బాబాపూర్, చామనపెల్లి ఉప సర్పంచులు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, మహిపాల్, ప్రజాప్రతినిధులు, నాయకులు రవి కిరణ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.












