ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం లో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో గొజ్జ జనార్దన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం లో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. మొత్తం 15 మంది సభ్యులు పూర్తి కోరంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.
చైర్మన్ పదవికి యాటకారి సాయన్న, గొజ్జ జనార్దన్ పోటీ చేయగా, అత్యధిక మెజార్టీతో గొజ్జ జనార్దన్ చైర్మన్‌గా, ఎంసీ లింగన్న వైస్ చైర్మన్‌గా, అల్లాడి రవి ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఎన్నికల అధికారి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కె. సత్యనారాయణ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారి శరత్ బాబు, సహాయకులు సాయందర్, సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా పూర్తయింది.
ఎన్నికైన నూతన మేనేజింగ్ కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.











