మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గత 40 ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్టించి పూజించడం, గ్రామస్తులంతా ఐక్యంగా ఉండడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె గ్రామంలోని మోక్ష కర్ర వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్తులు, మహిళలు కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడటం ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో కలిసి తన సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. గ్రామంలోకి ఎస్పీ రావడంతో స్థానిక సర్పంచ్ జయలలిత భోజన్న పూలగుచ్చంతో స్వాగతం పలికారు.
ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
గ్రామస్తులు, వందలాది మహిళలు భాజా భజంత్రీలతో గ్రామ ద్వారం వద్ద నుండి గణేశుని మండపం వరకు ఎస్పీ మేడంకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జయలలిత భోజన్న, ఏఎస్పి సాయికిరణ్, సిఐ రవీంద్రనాయక్, ఎస్ ఐ ప్రదీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











