సంఘం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 23
నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన సౌకర్యాల మెరుగుదలకు, స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం రూ. 30 లక్షల నిధుల మంజూరికి సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజక వర్గ బాధ్యుడు కుచాడి శ్రీహరి రావు ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.
నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన సౌకర్యాల మెరుగుదలకు, స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం రూ. 30 లక్షల నిధుల మంజూరికి సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజక వర్గ బాధ్యుడు కుచాడి శ్రీహరి రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి అంబేద్కర్ భవనం ప్రస్తుత పరిస్థితులను వివరించి, వినతి పత్రాన్ని అందజేశారు. భవనం లోపల ప్రతిధ్వని నివారణ, అతిథుల సౌలభ్యం కోసం కుర్చీలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అలాగే అంబేద్కర్ భవనంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. స్పందించిన మంత్రి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు. ఆయన వెంట సారంగాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ అబ్దుల్ హాది, అంబేద్కర్ యువజన జిల్లా నాయకులు కొంతం మురళీధర్, మధుకర్, అనిల్ తదితరులు ఉన్నారు.











