నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి హాజరయ్యారు.
వారు రిబ్బన్ కట్ చేసి చందన బ్రదర్స్ నూతన షోరూంను ఘనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. షోరూం అంతా తిరిగి వస్త్రాలను పరిశీలించారు. నిర్మల్ పట్టణంలో చందన బ్రదర్స్ లాంటి పెద్ద షోరూం రావడం సంతోషకరమని చైర్ పర్సన్ తెలిపారు. నిర్మల్ ప్రజలకు ఇకపై నాణ్యమైన బ్రాండెడ్ వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. చందన బ్రదర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
చందన బ్రదర్స్ షోరూంలో పురుషులకు, మహిళలకు, చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని తెలిపారు. నిర్మల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, చందన బ్రదర్స్ నిర్వాహకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












