నిర్మల్, 8 September
రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా మమడ ఏఈఓ సృజిత పిలుపునిచ్చారు. మమడ రైతు వేదికలో ఫార్మర్ ఐడీ లేని రైతుల కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
*ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసుకోవాలి - ఏఈఓ సృజిత* *మమడ, జిల్లా:* రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరిగా చేసుకోవాలని ఏఈఓ సృజిత పిలుపునిచ్చారు. మమడ రైతు వేదికలో కొంతమంది రైతులు ఇప్పటి వరకు ఫార్మర్ ఐడీ చేసుకోకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 11 అంకెల ఫార్మర్ ఐడీ నంబర్ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రైతు భరోసా, పీఎం కిసాన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులైన రైతులకు చేరుతాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు *పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్* ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే తమ ఫార్మర్ ఐడీ ని నమోదు చేసుకోవాలని కోరారు.












