నిర్మల్ జిల్లా మండలంలోని అందాకూరు గ్రామంలో అజిత్ సీడ్స్ పరమవీర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కంపెనీ ప్రతినిధులు పరమవీర్ బిజీ 2 రకం పత్తి విత్తనాల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.
అందాకూరు గ్రామంలో రైతు పృథ్వీరాజ్రావు పొలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అజిత్ సీడ్స్ పరమవీర్ కంపెనీ ఆర్ఎం వేణు యాదవ్, జోనల్ మేనేజర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
కంపెనీ ఆర్ఎం వేణు యాదవ్ మాట్లాడుతూ, పరమవీర్ బిజీ 2 రకం పత్తి విత్తనాలు ఏపుగా పెరిగి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, చీడపురుగులను సమర్థవంతంగా తట్టుకుంటాయని తెలిపారు. ఒక్కో మొక్కకు సుమారు 60-80 పత్తి కాయలు కాస్తున్నాయని, ఇది రైతులకు అధిక దిగుబడిని అందిస్తుందని పేర్కొన్నారు.
రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తన కంపెనీలను ఎంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ రకం విత్తనాలతో ఎకరానికి దాదాపు 18-20 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చని వివరించారు.












