యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బీబీనగర్ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండమడుగు సమీపంలో సుమారు 600 గొర్రెల మంద రైలు ఢీకొని మృతి చెందాయి. ఈ ఘటనలో రైతు కిష్టయ్యకు రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో కుక్కలు, అడవి పందులు బెదిరించడంతో భయపడిన గొర్రెల మంద రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో కిష్టయ్యకు చెందిన గొర్రెలన్నీ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. గొర్రెల పెంపకమే జీవనాధారంగా జీవిస్తున్న కిష్టయ్య కుటుంబం ఒక్కసారిగా తమ జీవనోపాధిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని తెలిపారు.
ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కిష్టయ్య కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని జాజుల లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని కోరారు. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న బీసీ గొల్ల, కురుమ కుటుంబాలకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి, వారి జీవనోపాధిని కాపాడే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.












