మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతుండగా, తాగునీటి సమస్యలు తప్పవనే భావనలో ఉన్న సామాన్య ప్రజలకు, అనుకోకుండా కురిసిన ఈ తుఫాన్ ప్రభావంతో వాతావరణం చల్లబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మిర్యాలగూడలో భారీ వర్షం విద్యుత్
Share:

సారాంశం
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ముఖ్య విషయాలు
- రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
- మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
- దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4449ఆర్టికల్స్
5,36,206వ్యూస్
