రామడుగు, 7 September
చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం రామడుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధి, సంక్షేమమేనని, మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ బిల్డింగ్కు 20 లక్షలు, విశ్వబ్రాహ్మణ సంఘానికి 4.16 లక్షలు, రామడుగు గ్రామాల్లో 50 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమైక్య భవనానికి, ఈఆర్ఓ భవనానికి 24 లక్షలతో నిర్మిస్తున్న భవనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ముందుకు వెళ్తున్నామని, మహిళలకు ఐక్యత చిహ్నంగా స్వశక్తి సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ముందుకు వెళ్తున్నారని, ఇప్పటివరకు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 26 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రేవంత్ సర్కార్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేతన్నలకు పని కల్పిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామన్నారు. రామడుగు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.












