బాసర, 7 September
హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, నిర్మల్ జిల్లా లో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ప్రజల తరపున ప్రశ్నిస్తే అరెస్టులా? అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో లో బీజేపీ నేతలకు ముందస్తు హౌస్ అరెస్ట్ నిర్మల్ జిల్లా // ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, సీనియర్ నాయకులు సతీశ్వర్ రావు, సిహెచ్. సాయినాథ్ తదితరులను పోలీసులు వారి నివాసాల్లోనే అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, నిరసనలను అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను హరించవద్దని వారు పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో లో ఉద్రిక్తత నెలకొంది.








