జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ సమ్మెట వెంకటేశ్వర్లుకు విద్యా, సాహితీ రంగాలలో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక స్వర్ణ నంది పురస్కారం లభించింది. మెగా హెల్పింగ్ హ్యాండ్స్, మెగా ఈవెంట్స్ సంస్థలు ఈ అవార్డులను అందజేస్తాయి.
మెగా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు మెగా ఈవెంట్స్ సంస్థలు ప్రతి సంవత్సరం విద్య, సాహిత్యం, సంస్కృతి, నృత్యం, జర్నలిజం రంగాలలో కృషి చేస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి స్వర్ణ నంది అవార్డులు, కీర్తి ఐకాన్ అవార్డులను ప్రధానం చేస్తుంటాయి. ఈ సంవత్సరం జిల్లాకు చెందిన, విద్యా, సాహితీ రంగాలలో కృషి చేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ సమ్మెట వెంకటేశ్వర్లును కూడా ఎంపిక చేసి, మొత్తం 32 మందికి అవార్డులు ప్రధానం చేయడం జరిగింది.
అవార్డుల ప్రదానం
హైదరాబాద్లోని కూకట్పల్లి బిర్లా ఆడిటోరియంలో నేడు స్వర్ణ నంది అవార్డుల ప్రదానం జరిగింది. సినీ నటులు శ్రీ గౌతమ్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి ఎస్.ఎం. రత్న, విశ్వక్ మూవీ డైరెక్టర్ వేణు, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి, సినీ నటి శ్రీమతి జ్యోత్స్న, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్, టీవీ ఆర్టిస్ట్ శ్రీమతి శిరీషారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు.












