మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్ విచారణ) మందకొడిగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 47.79 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వీరిలో 32 లక్షల మంది నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. విచారణకు హాజరు కాని వారికి మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఓటరు తుది జాబితాలో తమ పేరు ఉండాలంటే కచ్చితంగా నోటీసులకు స్పందించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్ విచారణ) ఆశించిన స్థాయిలో సాగడం లేదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 47.79 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వీరిలో 32 లక్షల మంది నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వారికి మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటరు తుది జాబితాలో తమ పేరు ఉండాలంటే కచ్చితంగా నోటీసులకు స్పందించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోలు ఓటర్లను నేరుగా కలిసి నోటీసులు ఇవ్వకుండా, ఫోన్ చేసి విచారణకు రావాలని చెప్పడం వంటి కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. కొందరు ఓటర్లు ఏ డాక్యుమెంట్లు సమర్పించాలో అర్థం కాక, మరికొందరు ఈసీ పేర్కొన్న 12 రకాల డాక్యుమెంట్లు అందుబాటులో లేక విచారణకు హాజరయ్యే విషయంలో నిరాసక్తత చూపుతున్నారని సమాచారం. రాజకీయ పార్టీలు నియమించిన బీఎల్వోలు కూడా ఓటర్లకు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటివరకు 5.74 లక్షల మంది నోటీసులు అందుకుని డాక్యుమెంట్లు సమర్పించారు. సుమారు 3 లక్షల మంది ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చేందుకు సిద్ధం చేయగా, 564 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డీఈవోల స్థాయిలో చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
కలెక్టర్ల స్థాయిలో సుమారు రెండున్నర లక్షల దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది. కొత్త ఓటు నమోదు, చిరునామా, ఇతర వివరాల మార్పు కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు ఏడున్నర లక్షలను ఆమోదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి. నిర్ణీత సమయానికి విచారణకు వెళ్లని వారికి రీ-షెడ్యూల్ నోటీసులు ఇస్తున్నారు. సుమారు 9 వేల మందికి మరోసారి నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న వారు కచ్చితంగా విచారణకు హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సిందేనని, లేకపోతే తుది జాబితాలో ఓటు ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చే సమయంలో కనిపించిన గందరగోళమే ఇప్పుడు కూడా కనిపిస్తోందని, నో మ్యాపింగ్, అనామలీస్ కేటగిరీల్లో 92.88 లక్షల మందికి నోటీసులు జనరేట్ అయ్యాయని తెలిపారు.












