షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం, షాద్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
*షాద్‌నగర్ లో ఉద్యోగ సంఘాల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ* ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, ఏఓ జ్యోతి, డీటీలు బాలవర్ధన్, మధు, సీనియర్ అసిస్టెంట్లు చంద్ర మోహన్, స్వర్ణకుమారి, ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు ప్రవలిక, శోభతో పాటు ఉపాధ్యాయులు తిరుమలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లలో 2వ పీఆర్సీని వెంటనే అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడం, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడం, ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ ఈహెచ్ఎస్ను అమలు చేయడం, జీవో 317 ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.. KP











