కేంద్రాన్ని (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
నిర్మల్: ఈవీఎం గోదాంలో కలెక్టర్ తనిఖీ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అగ్నిమాపక వ్యవస్థను తనిఖీ చేశారు. పోలీసులు నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. అగ్నిమాపక వ్యవస్థను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.











