జిల్లా కేంద్రంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈడి శ్రీనివాస్ తెలిపారు.
పట్టణంలోని గుల్జర్ మార్కెట్, బస్తీ దవాఖాన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. ఈ అంతరాయం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.











