నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పోచంపాడు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థినులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
అండర్-14 విభాగంలో 8వ తరగతి విద్యార్థిని పి.నీరజ హైజంప్‌లో బంగారు పతకం, 600 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక చేశారు. నీరజ రాష్ట్రస్థాయి క్రీడలకు కూడా ఎంపికైనట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.
అభినందనలు
నీరజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రిన్సిపల్ బి.సంగీత, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థినుల విజయానికి కృషి చేసిన క్రీడా ఉపాధ్యాయురాలు కే.స్వప్న, పీఈటీ జె.మౌనిక, పీడీలను ప్రిన్సిపల్ బి.సంగీత, సిబ్బంది అభినందించారు.












