5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్2026 నేపథ్యంలో నిజామాబాద్‌కు వస్తున్న పోలీస్ క్రీడాకారుల కోసం చేపడుతున్న వసతి సౌకర్యాల ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, ఐ.పి.యస్., పర్యవేక్షించారు. జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి, క్రీడాకారుల బస కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్2026 ముగింపు వేడుకల నేపథ్యంలో వివిధ జిల్లాలు, యూనిట్లకు చెందిన పోలీస్ క్రీడాకారులు నిజామాబాద్‌కు విచ్చేయనున్నారు. వారి కోసం అవసరమైన వసతి సౌకర్యాల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి, క్రీడాకారుల బస కోసం చేపడుతున్న ఏర్పాట్లను నేడు ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అధికారులకు సూచనలు
క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని, ప్రతి విభాగానికి ప్రత్యేక బాధ్యతలు కేటాయించి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
5 తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్2026ను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సమగ్ర ఏర్పాట్లు చేస్తోందని పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్, సి.టి.సి ఎ.సి.పి శ్రీ రాజశేఖర్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు, రుద్రూర్ సీఐ శ్రీ కృష్ణ, బోధన్ ఎస్హెచ్ఓ శ్రీ వెంకట్ నారాయణ, ఏడపల్లి ఎస్సై శ్రీమతి రమ తదితరులు పాల్గొన్నారు.


