నిర్మల్, 6 September
రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వం వహించారు.
బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన, చర్చించాల్సిన ప్రజా సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

