రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు మనోరంజని తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు కూడలికి చేరుకున్న లోకేష్‌కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం తెలిపారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో నారా లోకేష్‌ను సత్కరించారు.
రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు మనోరంజని తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు కూడలికి చేరుకున్న లోకేష్‌కు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం తెలిపారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో నారా లోకేష్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు కూడలిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు గౌరవం తెలిపారు.
తదుపరి రాప్తాడు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాలను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
లోకేష్ పర్యటన సందర్భంగా రాప్తాడులో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పార్టీ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు.












