డెంకడ, 7 September
పెంబి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసె రమేష్ యాదవ్, మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి జాన్సన్ నాయక్ చేసిన విమర్శలకు ప్రతిస్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
*మాది ప్రజా ప్రభుత్వం* *పెంబి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షలు గుడిసె రమేష్ యాదవ్* నిన్న మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామి నేరవేర్చలేదు అని విమర్శించడం వారి యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము అని కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షలు గుడిసె రమేష్ యాదవ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మీ యొక్క బిఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి రాకముందు దళితుణ్ణి ముఖ్యమంత్రి ని చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత దలితున్ని ముఖ్యమంత్రిని చేయక తనే ముఖ్యమంత్రి పీటము పై కూర్చుండి దళితుల్ని మోసం చేయలేదా మీరు గాని మీయొక్క బిఆర్ఎస్ పార్టీగాని దీనికి ఏమని సమదానం చెప్పుతారు. మాయొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము కల్పించినది. గృహజ్యోతి పథకం ద్వార 200 యూనిట్ల గృహ విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నాము. మొదటి విడత నాల్గు లక్షల యాబై వేళా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. మూడు కోట్లా ముఫై ఎనిమిది లక్షల మందికి ప్రజ పంపిణీ ద్వార సన్నబియ్యం, పదిహేను లక్షల నలబై ఆరు వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగినది. ఇలా చేప్పుకుంటు, పోతే ఎన్నో సంక్షేమ పథకములు మా మొక్క ప్రభుత్వం చేసుకొంటూ పోతుంది. మీరు పది సంవత్సరాలలో చేయని పనులను మా ప్రభుత్వం వెయ్యి రోజులలో చేసి చూపించింది. మీరు ఇప్పటికైన మా మొక్క ప్రజప్రభుత్వం ను విమర్శించడం మానుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంబి మండల సర్పంచుల సంఘం అద్యక్షులు మల్లెపల్లి సత్యానారయణస్వామి, వేణు నగర్ సర్పంచ్ టి. బీంరావ్, నాగాపూర్ సర్పంచ్ వెంకట్రాములు, సత్తుగూడ సర్పంచ్ లింగుపటెల్, కర్ణంలోద్ది సర్పంచ్ చిన్ను పటేల్, పోచంపల్లి సర్పంచ్ కళబోయి బద్య, లంబడి తాండ సర్పంచ్ గంగాధర్, సక్కిగూడ సర్పంచ్ సిడం శంకర్ పాల్గొన్నారు.


