మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
కేసీఆర్‌కు కష్టకాలం నడుస్తోంది. ఓటమి బాధ ఇంకా వీడకముందే, ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుందామన్నా ప్రశాంతత లేకుండా పోతోందని, ఇంటా బయటా మనో వేదననే మిగులుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కేసీఆర్, తండ్రి లేని లోటును తీర్చేలా కేటీఆర్ వ్యవహరించాలని ఆశిస్తున్నారు. ఈ ఓటమి కాలాన్ని కేటీఆర్‌కు అప్రెంటీస్ కాలంగా భావించి, నిత్యం ప్రజల మధ్య ఉంచడం ద్వారా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, తమకు మరో కేసీఆర్ దొరికారనిపించేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ ప్రణాళిక రచించారు.

అయితే, కేసీఆర్ ఆశించినదానికి, జరుగుతున్నదానికి పొంతన లేదనిపిస్తోంది. అసెంబ్లీకి వెళ్లడానికి కేసీఆర్‌కు ఇష్టం లేకపోగా, తాజాగా జరిగిన బీఆర్ఎస్ ఆందోళనను చూస్తే, కేటీఆర్‌కు కూడా అసెంబ్లీలో కూర్చుని, కాంగ్రెస్ సభ్యులు చెప్పే మాటలను ఓపిగ్గా వినే ఉద్దేశ్యం లేదని స్పష్టమవుతోంది. అందుకే, తొలిరోజే దండయాత్ర మొదలుపెట్టారు. నిజానికి, బ్లాక్ టీషర్టులు, వాటిపై రాతలతో వెళ్లాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ కార్యాచరణ తీసుకున్నది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి, మా పాలనపైనే విమర్శలా వెయ్యి రోజుల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి, ఇంట్లో ఉండి జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు అని ఎదురుదాడికి దిగడంతో, పోటాపోటీ నిరసనలు మొదలయ్యాయి. ఈ ఇరు పార్టీల కార్యాచరణతో ప్రజలకు ఏం లాభం కలుగుతుందో అర్థం కాక, తలలు గోక్కుంటున్నారు.
ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్‌లో కేటీఆర్ తనదైన డైరెక్షన్‌ను అమలు చేశారు. బ్లాక్ టీషర్టులు ఓకే అయినప్పటికీ, వాటిపై ఉన్న రాతలపై స్పీకర్‌కు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని పోలీస్ అధికారి కూడా స్పష్టం చేశారు. ఇక, హరీశ్ రావు తన బనీను ప్రదర్శించడం మితిమీరిపోయిందని, ఇది కేవలం హంగామా కోసమేనని ప్రజలు భావించారు.
మాజీ మహిళా మంత్రుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే అంశాన్ని హైలైట్ చేసుకోవాలనుకున్నారు. నిజంగానే అక్కడ తోపులాట జరిగి, వారు ఇబ్బంది పడ్డారు. కానీ, మధ్యలో ఎమ్మెల్సీ తాతా మధు మితిమీరిన ఓవర్ యాక్షన్, సోయిలేని బూతు డైలాగు స్పీకర్‌కే తాకింది. దీంతో, మొత్తం వ్యవహారం బూమరాంగ్ అయింది. అప్పటివరకు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతున్న తరుణంలో, తాతా మధు చర్య మొత్తం చెడగొట్టింది. దళిత స్పీకర్ పట్ల అవమానకర రీతిలో బూతులకు దిగినందుకు క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో అసలుకే ఎసరు తెచ్చింది.